ఆస్ట్రియాలోని పాఠశాలలో కాల్పులు కలకలం.. 10 మంది మృతి! 3 లక్షల మంది ప్రజలు!
Tue Jun 10, 2025 17:21 Australia
ఆస్ట్రియాలోని రెండో అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి బోర్గ్ డ్రెయిర్‌షుట్జెన్‌గాస్సే పాఠశాలలో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. అనంతరం నిందితుడైన విద్యార్థి పాఠశాల టాయిలెట్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పాఠశాల భవనం లోపలి నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందింది. ఆస్ట్రియా ప్రభుత్వ ప్రసార సంస్థ ఓఆర్ఎఫ్ కథనం ప్రకారం, ఈ కాల్పుల్లో కనీసం 10 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్యను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ.. 50 శాతానికి పైగా! భారత్‌లోనూ స్వల్పంగా..
మరణించిన వారిలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. కాల్పులు జరిపిన విద్యార్థి కూడా మరణించిన వారిలో ఉన్నాడని గ్రాజ్ నగర మేయర్ ఎల్కే ఖర్ వెల్లడించారు. "డ్రెయిర్‌షుట్జెన్‌గాస్సేలోని ఫెడరల్ అప్పర్ సెకండరీ పాఠశాలలో ఈ కాల్పులు జరిగాయని" ఆస్ట్రియా పోలీసులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం, పాఠశాలను పూర్తిగా ఖాళీ చేయించి, విద్యార్థులు, సిబ్బంది అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు ఎక్స్ ద్వారా తెలిపారు. గాయపడిన విద్యార్థులకు పాఠశాలకు సమీపంలోని హెల్మట్ లిస్ట్ హాల్ అనే ఈవెంట్స్ వేదిక వద్ద వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గ్రాజ్ నగరం ఆస్ట్రియాలో ఆగ్నేయ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సుమారు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Graz Austria #Austria school shooting #School shooting #Borg Dreierschützengasse school #Gun violence #Europe school #shooting Graz #Helmut List Halle
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.